Header Banner

గ్రూప్-2 మెయిన్స్‌పై అభ్యర్థుల్లో ఉత్కంఠ! కారణం ఇదే!

  Sat Feb 22, 2025 18:28        Politics

గ్రూప్2 పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని రోజుల పాటు పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ సెక్రటరీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ రాసిన లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై కోర్టులో వేసిన పిటిషన్ మార్చి11వ తేదీన విచారణ ఉన్నందున అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రేపు(ఫిబ్రవరి 23)న జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!


ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించినా ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో ఏపీపీఎస్సీ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గ్రూప్ 2 మెయిన్స్‌పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై ఏపీపీఎస్సీకి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్‌లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను ప్రభుత్వం అర్థం చేసుకుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


రోస్టర్ సమస్యను, అభ్యర్థుల న్యాయబద్ధమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖలో తెలిపింది. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ వర్గాలు స్పందించలేదు. లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించినా ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #group2 #mains #exam #todaynews #flashnews #latestupdate